V. V. Vinayak: ఏకంగా 500 కోట్ల‌తో వి వి వినాయ‌క్ సినిమా

Another Bollywood Offer to VV Vinayak
x

V. V. Vinayak: ఏకంగా 500 కోట్ల‌తో వి వి వినాయ‌క్ సినిమా

Highlights

V. V. Vinayak: మరొక బాలీవుడ్ ఆఫర్ సొంతం చేసుకున్న వి వి వినాయక్

V. V. Vinayak: టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన "ఛ‌త్ర‌ప‌తి" సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వి వి వినాయక్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టనున్నాడు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే బాలీవుడ్ నుంచి మ‌రో ఆఫ‌ర్ అందుకున్నారు వినాయక్. "ఛ‌త్ర‌ప‌తి" ని నిర్మిస్తున్న పెన్ స్టూడియోస్ సంస్థ‌ తాజాగా వినాయ‌క్ తో మ‌రో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యింది. ఈ విష‌యాన్ని బెల్లంకొండ సురేష్ స్వయంగా ధృవీక‌రించారు. ఛ‌త్ర‌ప‌తి సినిమా ఔట్ పుట్ చూసిన పెన్ స్టూడియోస్ నిర్మాత‌లు చాలా బాగా ఇంప్రెస్ అయ్యారట. వినాయ‌క్ తో మ‌రో సినిమా చేయ‌డానికి ముందుకొచ్చారు.

అయితే ఈ సినిమా కు ఏకంగా రూ.500 కోట్ల బ‌డ్జెట్ పెట్టడానికి కూడా సిద్ధమయ్యారట. వాళ్ల‌తో క‌థ చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి అని క్లారిటీ ఇచ్చారు వినాయక్. అంతేకాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న హిందీ "ఛ‌త్ర‌ప‌తి"కి సంబంధించిన అప్ డేట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఛ‌త్ర‌ప‌తి షూటింగ్ ఇప్పుడు పూర్త‌య్యిందట. హీరోయిన్ డేట్ల విష‌యంలో ఇబ్బందులు రావ‌డం వ‌ల్ల సినిమా ఆల‌స్య‌మైందని సమాచారం. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ ప‌నులు ముంబైలో జ‌రుగుతున్నాయి. సీజీ కోసం మూడు నెల‌లు సమయం పడుతుందట. ఛ‌త్ర‌ప‌తితో పోలిస్తే హిందీలో యాక్ష‌న్ సన్నివేశాల ఇంకా ఎక్కువ‌గా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories