"శ్యామ్ సింగరాయ్‌" లో కూడా సాయి పల్లవి కి హిట్ సాంగ్ ఉండబోతుందా?

Hit Song in Shyam Singha Roy Movie for Sai Pallavi | Tollywood News Today
x

"శ్యామ్ సింగరాయ్‌" లో కూడా సాయి పల్లవి కి హిట్ సాంగ్ ఉండబోతుందా?

Highlights

Shyam Singha Roy - Sai Pallavi: ఆ పాటని త్వరలోనే దర్శక నిర్మాతలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు...

Shyam Singha Roy - Sai Pallavi: స్టార్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చాలా సినిమాలలో కనీసం ఒక్క చార్ట్ బస్టర్ సాంగ్ అయినా ఉంటుంది. సినిమా విడుదల కాకముందే ఆ పాట ఆ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. ఎలా అయితే "వచ్చిండే" పాట "ఫిదా" సినిమా పై మరియు "సారంగదరియా" పాట "లవ్ స్టోరీ" సినిమాపై అంచనాలను పెంచాయో అదే విధంగా సాయి పల్లవి ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తున్న "శ్యామ్ సింగరాయ్‌" సినిమాలో కూడా అలాంటి ఒక పాటే ఉందట. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా ఒక అద్భుతమైన పాట ఉందట.

ఆ పాటని త్వరలోనే దర్శక నిర్మాతలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట కూడా సినిమా పై అంచనాలను పెంచే విధంగా ఉంటుందని వారి నమ్మకం. ఈ పాట షూటింగ్ మొత్తం కోల్కతాలో దసరా సమయంలో జరిగింది. "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది. వెంకట్ బోయినపల్లి ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories