వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం

Mega hero Varun Tej has Announced his 12th Movie | Tollywood News
x

వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం 

Highlights

వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం

Varun Tej Next Movie: మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్యనే "గని" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బాక్సర్ పాత్రలో కనిపించారు. మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయిందని చెప్పుకోవాలి. తాజాగా ఇప్పుడు తన తదుపరిశ్రమతో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ మధ్యనే తన కెరియర్ లోని 12వ సినిమా డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఉండబోతోంది అనే విషయాన్ని ప్రకటించారు వరుణ్ తేజ్. ఇప్పటికే ఈ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేశారు దర్శకనిర్మాతలు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు లండన్ లో జరగబోతుందట. అయితే తాజాగా ఈ సినిమా క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కూడా మౌనం వహించడంతో అనుమానాలు రెట్టింపు అయ్యాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 10వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో మెగా హీరో ఒక బాడీగార్డ్ పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కాకుండా వరుణ్ తేజ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని సైన్ చేశారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక పైలెట్ పాత్రలో కనిపించబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories