Simbu: శింబు సినిమాని రీమేక్ చేయబోతున్న మెగా హీరోలు

Mega Heroes Going to be Remake Simbu Movie
x

కోలీవుడ్ లో శింబు నటించిన మానాడు సినిమా 

Highlights

Simbu: కోలీవుడ్ ప్రముఖ హీరో సింబు మరియు ఎస్ జె సూర్య కలిసి నటించిన సినిమా "మానాడు".

Simbu: కోలీవుడ్ ప్రముఖ హీరో సింబు మరియు ఎస్ జె సూర్య కలిసి నటించిన సినిమా "మానాడు". భారీ అంచనాల మధ్య సై ఫై యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా కనిపించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య నవంబర్ 25 న విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి రివ్యూస్ ని అందుకుంటూ ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాని సురేష్ కామాచి నిర్మించారు.

అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని భారీ మొత్తాన్ని ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఒక కథ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా బాగా నచ్చుతుందని అభిప్రాయపడ్డ గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్ర రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం మెగా హీరోలు వరుణ్ తేజ్ మరియు సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రం తెలుగు రీమేక్లో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories