సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?

సినిమాలకి వీడ్కోలు చెప్పిన నాజర్
*సినిమాలకి వీడ్కోలు చెప్పిన నాజర్
Nasser Retirement: దక్షిణాది ప్రేక్షకులలో ప్రముఖ నటుడు నాజర్ గురించి తెలియని వారు ఉండరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో నటుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాలలో ముఖ్య పాత్రలు పోషించిన నాజర్ ఈమధ్య సినిమాలు బాగా తగ్గించేశారు. తాజాగా నాజర్ కి సంబంధించిన ఒక వార్త తమిళ్ ఇండస్ట్రీలో అభిమానులకి షాకిస్తోంది.
నాజర్ సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. యాక్టింగ్ కి రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నట్లుగా నాజర్ నిర్ణయించుకున్నారు అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.ఇక వివరాల్లోకి వెళితే ఆరోగ్య సమస్యల వల్ల నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో నాజర్ గుండె సంబంధిత సమస్యలతో బాధ పడ్డ సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి కొన్ని సినిమాల్లో మాత్రమే కనిపించిన నాజర్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకి వీడ్కోలు చెప్పబోతున్నారని తెలుస్తోంది."నాకు తెలిసినంతవరకు నేను చివరి దశలో ఉన్నాను. సినిమాపై ఆసక్తి ఉంది కానీ నా వయసు సహకరించాలి కదా. భవిష్యత్తులో ఒకవేళ నటించినా కూడా చాలా సెలెక్టివ్ రోల్స్ ని ఎంచుకుంటాను" అని నాజర్ రెండేళ్ల క్రితమే చెప్పారు. ఏదేమైనా నాజర్ వంటి విలక్షణ నటుడు ఇకపై సినిమాలలో కనిపించరు అని అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMTతిరుమలలో తెలుగమ్మాయి, అమెరికా అబ్బాయి పెళ్లి
6 Aug 2022 6:05 AM GMTKomatireddy Venkat Reddy: రేవంత్ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను..
5 Aug 2022 7:27 AM GMT
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTఎన్టీఆర్ తో నటించే అవకాశం కోల్పోయిన సమంత
8 Aug 2022 9:20 AM GMTసినీ ఇండస్ట్రీపై దిల్ రాజు కీలక కామెంట్స్
8 Aug 2022 7:32 AM GMTరాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. ఆరు నెలల్లోపు..
8 Aug 2022 7:26 AM GMTPM Modi: వెంకయ్య సభను నడిపించే విధానం కొత్త వారికి ఆదర్శం
8 Aug 2022 7:12 AM GMT