Prabhas: ఆకాష్ పూరి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న ప్రభాస్

Prabhas: ఆకాష్ పూరి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న ప్రభాస్
x

రొమాంటిక్ ట్రైలర్ లాంచ్ చేసిన ప్రభాస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Prabhas: ప్రేక్షకులు నన్ను ఎలా చూశారో అని ఆశ్చర్యపోతున్న ప్రభాస్

Prabhas: పూరి జగన్నాథ్ తనయుడైన ఆకాష్ పూరి తన రెండవ సినిమా "రొమాంటిక్" తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సినిమా గురించి మాట్లాడుతూ లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అది ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది అని అన్నారు ప్రభాస్. "ట్రైలర్ లో లాస్ట్ సీన్ లో ఆకాష్ ని చూస్తే ఒక పదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న నటుడిలా కనిపించాడు. ఆ షాట్ లో తను చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు" అని అన్నారు ప్రభాస్.

"కొంతమంది నటుడిగా ఎదగడానికి చాలా కాలం తీసుకుంటారు. కానీ ఆకాష్ పూరి రెండో సినిమాకి చాలా మెచ్యూరిటీ ని చూపించాడు. నిజానికి నేను నా ఫస్ట్ సినిమా చూసుకున్నప్పుడు అసలు ప్రేక్షకులు నన్ను ఎలా చూడగలిగారో అని ఆశ్చర్యమేసింది" అని అన్నారు ప్రభాస్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ "బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై" సినిమాలో నటించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక "బాహుబలి" సినిమాతో మెప్పించిన ప్రభాస్ ఇప్పుడు మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories