Ram Gopal Varma: ‘శివ’ చిన్నారి సుష్మ ఇప్పుడు ఇలా.. ఫొటోతో గుర్తు చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ

‘శివ’ చిన్నారి సుష్మ ఇప్పుడు ఇలా.. ఫొటోతో గుర్తు చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ
x

‘శివ’ చిన్నారి సుష్మ ఇప్పుడు ఇలా.. ఫొటోతో గుర్తు చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ

Highlights

‘శివ’ సినిమాలోని ఆ సైకిల్‌ ఛేజ్‌ సీన్‌ గుర్తుందా? అందులో కనిపించిన చిన్నారి సుష్మ ఇప్పుడెలా ఉందో తెలియజేస్తూ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో ఫొటోను పంచుకున్నారు.

శివ’ సినిమాలోని ఆ సైకిల్‌ ఛేజ్‌ సీన్‌ గుర్తుందా? అందులో కనిపించిన చిన్నారి సుష్మ ఇప్పుడెలా ఉందో తెలియజేస్తూ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె యూఎస్‌లో ఏఐ (AI), కాగ్నిటివ్‌ సైన్స్‌లో రీసెర్చ్‌ చేస్తున్నట్టు తెలిపారు.

‘‘సుష్మా.. నువ్వు ఆ సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించావు. ఆ రిస్కీ షాట్‌ సమయంలో నువ్వెంత భయపడ్డావో అప్పుడు నాకు దర్శకుడిగా తెలియదు. ఇప్పుడు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా. దయచేసి అంగీకరించు’’ అని ఆర్జీవీ పోస్ట్‌ చేశారు.

హీరో అన్నయ్య కూతురి పాత్రలో సుష్మ నటించింది. కథానాయకుడు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా విలన్ల గ్యాంగ్‌ వెంబడించే ఆ సన్నివేశాన్ని డూప్‌ లేకుండా చిత్రీకరించినట్టు నాగార్జున ఇటీవల వెల్లడించారు. నాగార్జున హీరోగా రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ క్లాసిక్‌ హిట్‌ ‘శివ’ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

తరతరాల ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు ఈనెల 14న (Shiva Re-Release Date) ‘శివ’ సినిమా మరోసారి థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుష్మపై ఈ ప్రత్యేక పోస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories