Regina Cassandra: 'రాకెట్ బాయ్స్' లో రెజీనా కీలక పాత్ర ..!

Regina Cassandra To Act In Rocket Boys Web Series
x

రెజీనా (ఫొటో ట్విట్టర్)

Highlights

Regina Cassandra: ప్రస్తుతం మూవీస్‌ కంటే ఓటీటీల్లో వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతోంది.

Regina Cassandra: ప్రస్తుతం మూవీస్‌ కంటే ఓటీటీల్లో వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతోంది. దీంతో మేకర్స్ కూడా వెబ్ సిరీస్‌లపైనే ఫోకస్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్లు కూడా వీటిలో నటించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా రెజీనా కసెండ్రా కు కూడా ఓ బంపర్ ఆఫర్ తగిలింది.

అంతరిక్ష రంగంలో ఎంతో కృషి చేసిన అబ్దుల్ కలాం, హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్ లాంటి వాళ్ల జీవిత గాధలతో ఓ వెబ్ సిరీస్ రానుంది. దీనికి 'రాకెట్ బాయ్స్' అనే పేరు పెట్టారు. ఈ వెబ్ సిరీస్ లో ఇశ్వాక్ సింగ్, జిమ్ సర్భ్ ముఖ్య పాత్రలు పొషిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో రెజీనా కనిపించనుందట.

రాయ్ కపూర్ ఫిల్మ్స్ అండ్ ఎమ్మీ ఎంటర్ టైన్ మెంట్స్ కలిసి ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. స్పేస్ సైన్స్ ఆధారంగా తీస్తున్న సిరీస్ కావడంతో ఇంటర్నేషనల్ లెవల్ లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు స్కోప్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories