Samantha: విజయ్ దేవరకొండ అభిమానులకు సారీ చెప్పిన సమంత.. ఎందుకంటే.. ?

Samantha Apologized To Vijay Deverakonda Fans
x

విజయ్ దేవరకొండ ఫాన్స్ కి సారీ చెబుతున్న సమంత

Highlights

* సోషల్ మీడియా ద్వారా యువ హీరో ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన సమంత

Kushi: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో "ఖుషి" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నిన్ను కోరి, మజిలీ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన శివా నిర్వాణ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తయింది.

మహానటి సినిమా తర్వాత మళ్లీ సమంత మరియు విజయ్ దేవరకొండలో కెమిస్ట్రీ చూడడానికి అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ సమంత ఆరోగ్య పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న సంగతికి తెలిసిందే. మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స పొందుతూ సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు సమంత మళ్ళీ సినిమా షూటింగ్ని మొదలు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పింది.

"ఖుషి సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి నా క్షమాపణలు,"అని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది సమంత. అయితే త్వరలోనే షూటింగ్ మళ్లీ మొదలవుతుండడంతో ఫాన్స్ కూడా సంతోషిస్తున్నారు. ముందు సమంత తన ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని సమంత అభిమానులతో పాటు విజయ్ దేవరకొండ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక సామ్ ట్వీట్ కు విజయ్ దేవరకొండ కూడా "మేమంతా నువ్వు పూర్తి ఆరోగ్యం మరియు పెద్ద చిరునవ్వుతో తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాము," అని రిప్లై ఇచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories