Venkatesh-Trivikram: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకటేష్!

Venkatesh 75th Movie Directed by Trivikram
x

Venkatesh-Trivikram:(File Image)

Highlights

Venkatesh-Trivikram: విక్టరీ వెంకటేష్ ను మాటల మాత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నట్లు టాలీవుడ్ టాక్

Venkatesh-Trivikram: విక్టరీ వికటేష్ హీరోగా త్రివిక్రమ్ వీరి కాంబోలో వచ్చిన 'మల్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్' లాంటి సినిమాలకు పనిచేసింది తెలిసిందే. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత చాలా ఏళ్ళకు వెంకటేష్ హీరోగా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. మరి వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతున్నట్టు అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది కానీ అది వర్కౌట్ కాలేదు.

ప్రస్తుతం వెంకటేష్.. 'నారప్ప'తో పాటు 'దృశ్యం 2' సినిమాలు కంప్లీట్ చేశారు. అంతా బాగుంటే ఈ శుక్రవారమే 'నారప్ప' సినిమా విడుదలై ఉండేది. ఇక వెంకటేష్.. నారప్ప 72వ సినిమా.. 'దృశ్యం 2' 73వ మూవీ.. 'ఎఫ్ 3' 74 చిత్రం. అందుకే తన లాండ్ మార్క్ మూవీ 75వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. మరోవైపు వెంకటేష్.. మలయాళంలో హిట్టైన 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు

ఇక త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా 'డ్రైవింగ్ లైసెన్స్' మూవీ రీమేకా.. లేకపోతే.. హిందీలో హిట్టైన 'జాలీ ఎల్‌ఎల్‌బీ 2' రీమేకా అని తెలియాల్సి ఉంది. ఇప్పటికే వెంకటేష్.. త్రివిక్రమ్‌తో 'జాలీ ఎల్‌ఎల్‌బీ 2' సినిమా రీమేక్ చేయాలనుకున్నారు. ఎందుకో వర్కౌట్ కాలేదు. మరోవైపు వెంకటేష్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అజ్ఞాతవాసి'లో కాసేపు అతిథి పాత్రలో మెరిసారు. ఈ సన్నివేశాన్ని ఆ తర్వాత యాడ్ చేసిన సంగతి తెలిసిందే కదా. వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories