ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు ముమ్మరం.. ఆత్మాహుతి దాడా..? ఉగ్ర కుట్ర కోణంపై విచారణ

ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు ముమ్మరం.. ఆత్మాహుతి దాడా..? ఉగ్ర కుట్ర కోణంపై విచారణ
x

ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు ముమ్మరం.. ఆత్మాహుతి దాడా..? ఉగ్ర కుట్ర కోణంపై విచారణ

Highlights

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆత్మాహుతి దాడా... ఉగ్ర కుట్రలో భాగమా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆత్మాహుతి దాడా... ఉగ్ర కుట్రలో భాగమా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్, NCG, NIA అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఐ20 కారులో ఫ్యూయల్, అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లను దుండగుడు తీసుకొచ్చినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అటు హరియాణా రిజిస్టర్డ్ కారును కశ్మీర్‌ వాసి తారిఖ్ కొన్నాక పలువురి నుంచి సోమవారం డ్రైవ్ చేసిన డాక్టర్ ఉమర్‌కు చేరింది.

ఢిల్లీ బ్లాస్ట్‌పై UAPA చట్టం కింద ఢిల్లీ కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. UAPAలోని సెక్షన్ 16, 18 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కూడా కేసులు బుక్ అయ్యాయి. సోమవారం అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఫరీదాబాద్‌లోని మాడ్యూల్‌కు ఈ పేలుడుతో సంబంధం ఉన్నట్లు ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పేలుడు జరిగిన ఐ20 కారులో ఎర్రకోట సమీపంలో పార్కింగ్ వద్ద దాదాపు మూడు గంటల పాటు ఉందని గుర్తించారు. ప్రమాదానికి కొంత సమయం ముందే అక్కడి నుంచి బయలుదేరినట్లు సీసీ టీవీ పుటేజీలో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పేలుడుకు సంబంధించి సూచనల కోసం అక్కడి నుంచి వేచి చూసినట్లు తెలుస్తోందన్నారు. ఉమర్‌తో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయం తెలుసుకోవడానికి దర్యాగంజ్, పహార్‌గంజ్ ప్రాంతాల్లోని అతిథి గృహాల్లో రిజిస్టర్‌లను, ఎంట్రీలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు.

ఢిల్లీ పేలుడులో డాక్టర్ ఉమర్ పాత్ర నిర్ధరణ కోసం డీఎన్‌ఏ పరీక్షలు జరపనున్నారు. కశ్మీర్‌లోని అతడి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరిస్తారు. డాక్టర్ ఉమర్ తల్లి, ఇద్దరు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమర్ కారులో ఉన్నట్లు అనుమానాలు వస్తుండటంతో డీఎన్‌ఏ పరీక్షలకు సిద్ధమయ్యారు.

దేశవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతుంది. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్, బస్‌ టెర్మినల్స్ వద్ద బందోబస్తు చేపట్టారు. పలు ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుడుతో ఎర్రకోటను నవంబర్ 13 వరకు మూసి వేసేందుకు పోలీసులు నిర్ణయించారు. దర్యాప్తునకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే లాల్‌ఖిలా మెట్రో స్టేషన్‌ను కూడా మూసివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories