Kerala Lockdown: మరో వారం లాక్‌డౌన్‌ పొడిగింపు

Kerala Lockdown
x

కేరళ సీఎం పినరయి విజయన్‌ ఫైల్ ఫోటో 

Highlights

Kerala Lockdown: క‌రోనా వైప‌ర్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తుంది.

Kerala Lockdown: క‌రోనా వైప‌ర్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తుంది. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ విధించాయి. మ‌రి కొన్ని రాష్ట్రాలు కరోనా క‌ట్ట‌డిలో భాగంగా క‌ర్ఫ్యూని విధించాయి. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. ఈ నేప‌థ్యంలో కేర‌ళ ప్రభుత్వం మ‌రో వారం లాక్ డౌన్ పొడిగిస్తున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకుంది

కేరళలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోవడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న తిరువనంతపురం, త్రిశూర్‌, ఎర్నాకుళం, మలప్పురంలో మరో వారం ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ ఉంటుందని స్పష్టం చేసింది.లాక్‌డౌన్‌ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. . ఈ జిల్లాల్లో మరింత కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు

అలాగే మేలో అందిస్తున్నట్లుగా జూన్‌లోనూ ఉచిత ఆహార కిట్లు అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మే నెలలో వెల్ఫేర్‌ పెన్షన్స్‌ కింద రూ.823.23 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అలాగే వేల్ఫేర్ బోర్డులలో ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.1000 ఆర్థిక సాయం ప్రకటించారు. మే 8న ప్రారంభమైన లాక్‌డౌన్‌ వాస్తవానికి మే 16తో ముగియాల్సి ఉంది. కానీ, కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో లాక్‌డౌన్‌ను పొడిగించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నిర్ణయించారు

Show Full Article
Print Article
Next Story
More Stories