Tauktae Cyclone: ముంచుకొస్తున్న 'తౌక్టే' తుపాన్ ముప్పు

Tauktae Cyclone
x

Tauktae Cyclone

Highlights

Tauktae Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.

Tauktae Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడి ఈ నెల 16న తుపానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపానుగా మారితే దీన్ని 'తౌక్టే' అని పిలుస్తారు. 'తౌక్టే' తీవ్ర తుపానుగా, అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది, గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.

.ప్రభావంతో లక్ష్యద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, కొంకణ్-గోవా, గుజరాత్, నైరుతి రాజస్థాన్‌లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ నివేదికలో పేర్కొన్నారు. తుపాను తీరాన్ని సమీపించే కొద్దీ బలమైన గాలులు, కుంభవృష్టి తప్పదని హెచ్చరించారు. తౌక్టే ప్రభావం ఏపీపై పాక్షికంగా ఉంటుందని తెలిపారు. రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళకు రానున్న నేపథ్యంలో, వాటి ఆగమనానికి ఈ తుపాను మార్గం సుగమం చేస్తుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక.. 'తౌక్టే' ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 15, 16 తేదీల్లో తెలంగాణ నైరుతి జిల్లాల్లో అధికంగా వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.

మరోవైపు.. 'తౌక్టే' తుపాన్ ఎఫెక్ట్‌తో ఐదు రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించామని కేంద్రం ప్రకటించింది. తుపాన్ దృష్ట్యా సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు పంపించారు. ఎన్డీఆర్ఎఫ్ 53 బృందాలను ఐదు రాష్ట్రాల్లో సంసిద్ధంగా ఉంచామని ఎన్డీఆర్ఎఫ్ డీజీ సత్యప్రధాన్ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories