అనంతశయన విష్ణువు – ఉండవల్లి గుహలు (ఆంధ్రప్రదేశ్)
గుంటూరు జిల్లాలోని ఉండవల్లి గుహల్లో దాదాపు 1,600 ఏళ్ల నాటి ఏకశిలా అనంతశయన విష్ణుమూర్తి శిల్పం ఉంది. విష్ణుకుండిన రాజుల కాలం (క్రీ.శ. 420–620)లో చెక్కబడిన ఈ నాలుగు అంతస్తుల తొలిచాన గుహలు ప్రాచీన విశ్వకర్మ స్థపతుల శిల్పకళా ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యం.