నైనా దేవి ఆలయం, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో నైని సరస్సు ఉత్తర తీరాన నైనా కొండపై నైనా దేవి ఆలయం కొలువై ఉంది. ఇక్కడి ప్రధాన దేవతను రెండు నేత్రాల రూపంలో నైనా దేవిగా ఆరాధిస్తారు. నైనిటాల్‌ను ప్రముఖ శక్తిపీఠాల్లో ఒకటిగా భావిస్తారు. సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు సంచరిస్తున్న సమయంలో ఆమె నేత్రాలు పడిన ప్రదేశమే ఈ క్షేత్రమని భక్తుల విశ్వాసం. ఆలయ గర్భగుడిలో కాళీదేవి, నైనా దేవి, గణేశుడు కొలువై ఉంటారు. భాద్రపద శుక్ల అష్టమి రోజున మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో జరిగే ఉత్సవాల తరహాలో ఇక్కడ కూడా విగ్రహ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తారు.