కొత్త కార్ల కోసం చూస్తున్నారా? త్వరలో విడుదల కానున్న 11 క్రేజీ మోడల్స్ ఇవే!
ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ
ఎంజీ సంస్థ తమ నూతన ADAPT ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని (హెక్టార్ టోమాహాక్) మార్కెట్లోకి తీసుకువస్తోంది.
కియా సోరెంటో
కియా నుంచి సెప్టెంబర్ 4, 2026 న కొత్త ఫ్లాగ్‌షిప్ హైబ్రిడ్ ఎస్‌యూవీ విడుదల కానుంది. ఇది 2.2 లీటర్ డీజిల్ మరియు 1.6 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
మారుతి బెలెనో ఫేస్‌లిఫ్ట్
మరిన్ని అధునాతన ఫీచర్లతో వస్తున్న కొత్త బెలెనోలో లెవెల్-1 ADAS, వైర్‌లెస్ ఛార్జర్ మరియు కొత్త 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను జోడించారు.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్
షార్ప్ డిజైన్, అదనపు ఫీచర్లు మరియు సరికొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఈ సెడాన్ సిద్ధమైంది.
మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్
వచ్చే నెలలో రానున్న థార్ ఫేస్‌లిఫ్ట్ మోడల్.. సరికొత్త రోక్స్ (ROXX) లాంటి ఫ్రంట్ గ్రిల్, బంపర్లు మరియు సి-షేప్డ్ డిఆర్‌ఎల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో వస్తోంది.
కొద్దిపాటి స్టైలింగ్ మార్పులు మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ త్వరలో లాంచ్ కానుంది.
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్
మధ్యతరహా సెడాన్ అయిన వర్టస్ మోడల్‌ను మరింత ఆకర్షణీయమైన లుక్, కొత్త ఫీచర్లు మరియు అప్‌డేటెడ్ గేర్‌బాక్స్‌తో తీసుకురానున్నారు.
హ్యుందాయ్ బేయాన్ డెరివేటివ్
హ్యుందాయ్ లైనప్‌లో వెన్యూ (Venue) మరియు క్రెటా (Creta) కార్ల మధ్యలో సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ త్వరలో ప్రవేశపెట్టబడుతుంది.
టాటా టిగోర్ ఈవీ & ఐసీఈ ఫేస్‌లిఫ్ట్
టాటా మోటార్స్ తమ పాపులర్ టిగోర్ ఎలక్ట్రిక్ మరియు పెట్రోల్ (ICE) వెర్షన్లకు భారీ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌ను ఇవ్వనుంది.
టాటా సఫారీ ఈవీ
పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ టాటా నుంచి రాబోతున్న మొట్టమొదటి 3-రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం.
రెనో ట్రైబర్ టర్బో
కుటుంబాల కోసం ప్రత్యేకంగా లభించే రెనో ట్రైబర్ త్వరలోనే మరింత శక్తివంతమైన టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి రానుంది.