Tomato: మన వంటింట్లో సులభంగా లభించే కూరగాయలలో టమాటా ఒకటి. సాధారణంగా వంటలలో వాడే టమాటాను పచ్చిగా తీసుకోవడం వల్ల శరీరానికి రెట్టింపు పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజూ ఒక పచ్చి టమోటాను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మానికి సహజమైన కాంతి వస్తుంది. గుండె ఆరోగ్యం నుంచి బరువు తగ్గడం వరకు దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.