రక్తకణాల సంఖ్యను పెంచే 7 సూపర్ ఫుడ్స్ ఇవే

రక్తకణాలు
రక్తంలో ఎర్ర, తెల్ల రక్తణాలు థ్రాంబోసైట్లు లేదా ప్లేట్ లెట్స్ ఉంటాయి. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా బారిన పడే ఛాన్స్ ఎక్కువగా ఉటుంది. దీంతో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతుంది. రక్తకణాల సంఖ్యను పెంచే 7 రకాల ఫుడ్స్ ఏవో చూద్దాం.
గోధుమ గడ్డి
గోధమ గడ్డిలో క్లోరోఫిల్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ గడ్డి ఎరుపు, తెల్ల రక్తకణాలను కూడా పెంచుతుంది. దీన్ని జ్యూస్ రూపంలో తాగవచ్చు.
గుమ్మడికాయ
గుమ్మడికాయలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ప్లేట్ లెట్స్ కౌంట్ ను పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే క్యారెట్ తోపాటు చిలకడదుంపలను కూడా తినవచ్చు.
బొప్పాయి ఆకు రసం
బొప్పాయిలో డెంగ్యూ జ్వరం సమయంలో అద్భుతంగా పనిచేస్తుంది. ప్లేట్ లెట్ కౌంట్ ను త్వరగా పెంచుతుంది. బొప్పాయి రసం చేదుగా ఉన్నప్పటికీ..దీనిని క్యాప్యూల్స్ రూపంలో తీసుకోవచ్చు.
దానిమ్మ
దానిమ్మలో ఐరన్ కంటెంట్ రక్తకణాలను పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకోవడానికి, ఇమ్యూనిటిని పెంచేందుకు సహాయపడుతుంది.
అలోవెరా
కలబందలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ నిర్వహించడంతోపాటు తెల్ల రక్త కణాలను ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
పాలు
పాలలో కాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ కె కూడా అధికమోతాదులో ఉంటుంది. రక్త గడ్డకట్టడానికి సహాయపడుతుంది. శరీరంలో ప్లేట్ లెట్ల కౌంట్ పెంచేందుకు సహాయపడుతుంది.
పాలకూర
పాలకూర వంటి ఆకుకూరలు ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచడంలో మేలు చేస్తాయి. వీటిలోని విటమిన్ కె రక్తం గట్టకట్టడంలో సహాయపడతాయి.