పాల కంటే కాల్షియం అధికంగా ఉండే 9 రకాల సూపర్ ఫుడ్స్ ఇవే

తెల్లనువ్వులు
పాలు తాగే అలవాటు లేనివాళ్లు తెల్లనువ్వులను ఆహారంలో చేర్చుకుంటే కాల్షియం పుష్కలంగా అందుతుంది. 1 స్పూన్ తెల్ల నువ్వులు తింటే గ్లాసెడు పాలకంటే 8 రెట్లు కాల్షియం అందుతుంది.
చియా సీడ్స్
చియా సీడ్స్ లో ప్రొటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.
గుమ్మడి విత్తనాలు
గుమ్మడికాయ విత్తనాల్లో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. 2 స్పూన్ల గుమ్మడి విత్తనాల్లో గ్లాసు పాలకంటే ఎక్కువగా కాల్షియం లభిస్తుంది.
టోఫు
సోయా పాలతో తయారు చేసిన టోఫులో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. 100 గ్రాముల టోఫు తీసుకోవడం వల్ల సుమారు 680 మిల్లీ గ్రాముల కాల్షియం మనకు లభిస్తుంది.
లీఫ్ క్యాబేజీ
లీఫ్ క్యాబేజీ తీసుకుంటే కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. 100 గ్రాముల లీఫ్ క్యాబేజీలో 250 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది.
బాదం
బాదంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. వీటితోపాటు ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ కూడా అధిక మోతాదులో ఉంటుంది.
పాలు
పాలలో కూడా విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పాలల్లో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఒక గ్లాసు పాలలో 125 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది.
మునగాకు
మునగ ఆకుల్లో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మునగ ఆకుల్లో పాలకంటే ఎక్కువగా కాల్షియం ఉంటుంది.