సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసే చిన్న వీడియోలు, రీల్స్ లేదా వాయిస్ నోట్ల నుంచి కేవలం కొన్ని సెకన్ల ఆడియోను సేకరించి కేటుగాళ్లు సరిగ్గా అచ్చం అలాంటి గొంతును సృష్టిస్తున్నారు.
అత్యవసర పరిస్థితి పేరుతో భయపెట్టడం
మీ కుటుంబ సభ్యుడు ఎవరైనా ప్రమాదంలో ఉన్నారని లేదా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని నమ్మిస్తూ, అదే గొంతుతో ఫోన్ చేసి వెంటనే డబ్బులు పంపాలని కోరుతారు.
కుటుంబంలో రహస్య కోడ్‌వర్డ్ ఏర్పాటు
ఇలాంటి మోసాలను తిప్పికొట్టడానికి ఇంట్లోని అందరికీ తెలిసేలా ఒక ప్రత్యేకమైన సీక్రెట్ కోడ్‌ను లేదా పదాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
అనుమానాస్పద కాల్ వస్తే వెంటనే తిరిగి ఫోన్ చేయడం
అత్యవసరంగా డబ్బులు అడిగి ఫోన్ వస్తే, వెంటనే ఆ కాల్ కట్ చేసి వారి అసలు నంబర్‌కు తిరిగి కాల్ చేసి అసలు నిజం ఏంటో నిర్ధారించుకోవాలి.
సోషల్ మీడియా అకౌంట్లు ప్రైవేట్‌గా ఉంచుకోవడం
మీ వ్యక్తిగత వీడియోలు, ఆడియో క్లిప్‌లు పబ్లిక్‌లో అందరికీ కనిపించకుండా ప్రైవేట్ మోడ్‌లో ఉంచుకోవడం ద్వారా వాయిస్ కాపీ చేసే రిస్క్ తగ్గుతుంది.
అనుమానాస్పద లింకులు, ఓటీపీలు చెప్పకపోవడం
ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్‌లో వచ్చే అనవసరమైన లింకులను క్లిక్ చేయడం, ఓటీపీలు లేదా బ్యాంక్ వివరాలను ఎవరికీ వెల్లడించకూడదు.
సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930
ఒకవేళ మీరు ఎక్కడైనా ఇలాంటి సైబర్ మోసాల బారిన పడి డబ్బులు కోల్పోతే, ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.
సంచార్ సాథీ పోర్టల్ ఉపయోగం
అనుమానాస్పద కాల్స్, నకిలీ నంబర్ల బారిన పడకుండా ప్రభుత్వానికి చెందిన అధికారిక 'సంచార్ సాథీ' పోర్టల్‌ను ఉపయోగించి రిపోర్ట్ చేయవచ్చు.
ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటం
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎవరికీ గుడ్డిగా డబ్బులు పంపకుండా కాస్త ఆలోచించి, సంయమనంతో వ్యవహరించడమే ఈ మోసాల నుంచి రక్షణ కవచం.