రూమ్ సైజ్ ఫస్ట్ :

ఎయిర్ ప్యూరిఫైయర్ కొనేముందు అది ఉపయోగించే రూమ్ సైజ్‌ను తప్పనిసరిగా చెక్ చేయాలి. చిన్న రూమ్‌కు చిన్న మోడల్, పెద్ద లివింగ్ రూమ్‌కు ఎక్కువ కవరేజ్ ఉన్న మోడల్ ఎంచుకోవాలి.
CADR చూస్తే క్లారిటీ :
ప్యూరిఫైయర్ ఎంత వేగంగా గాలిని క్లీన్ చేయగలదో చెప్పేది CADR. 150–200 చదరపు అడుగుల రూమ్‌కు కనీసం 250 m³/h CADR ఉన్న మోడల్ చూడటం మంచిది.
ట్రూ HEPA తప్పనిసరి :
దుమ్ము, పొగ, పుప్పొడి వంటి సూక్ష్మ కణాలను ఫిల్టర్ చేయడానికి True HEPA ఫిల్టర్ కీలకం. ‘HEPA-like’ వంటి మార్కెటింగ్ పదాలను చూసి మోసపోకుండా ఫిల్టర్ స్పెసిఫికేషన్ చెక్ చేయాలి.
కార్బన్ ఫిల్టర్ కూడా కావాలి :
కేవలం HEPA ఫిల్టర్‌తో సరిపోదు. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ ఉంటే హానికరమైన గ్యాసెస్, VOCs వంటి కాలుష్యాలను కూడా ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది.
ACH రేటింగ్ చెక్ :
ACH అంటే ఒక గంటలో రూమ్‌లోని గాలిని ప్యూరిఫైయర్ ఎన్ని సార్లు క్లీన్ చేయగలదో తెలిపే రేటింగ్. సాధారణంగా 4–5 ACH సరిపోతుంది, ఎక్కువ కాలుష్యం ఉన్నప్పుడు 6–8 ACH మోడల్స్ ఉపయోగకరంగా ఉంటాయి.
ఫిల్టర్ ఖర్చు మర్చిపోవద్దు :
ప్యూరిఫైయర్ ధర మాత్రమే కాకుండా రీప్లేస్‌మెంట్ ఫిల్టర్ ధరను కూడా చూడాలి. ఫిల్టర్ ఎంతకాలం పనిచేస్తుంది, మార్కెట్‌లో సులభంగా దొరుకుతుందా అనేది ముందే చెక్ చేయాలి.
స్మార్ట్ ఫీచర్లు తర్వాతే :
యాప్ కంట్రోల్, వాయిస్ కమాండ్స్, రియల్‌టైమ్ AQI వంటి ఫీచర్లు బాగానే ఉంటాయి. కానీ వీటికంటే ఫిల్ట్రేషన్, కవరేజ్, మెయింటెనెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
నాయిస్ లెవల్ కూడా ముఖ్యం :
ప్యూరిఫైయర్ రోజంతా, రాత్రిళ్లు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బెడ్‌రూమ్ కోసం కొనేటప్పుడు 30 డెసిబెల్స్‌లోపు క్వైట్ లేదా స్లీప్ మోడ్ ఉన్న మోడల్‌ను చూడాలి.
ధర కాదు.. పనితీరు ముఖ్యం :
ఎక్కువ ధర ఉన్న ప్యూరిఫైయర్ తప్పనిసరిగా బెస్ట్ అని చెప్పలేం. చిన్న, మీడియం రూమ్‌లకు మంచి HEPA, కార్బన్ ఫిల్టర్లున్న మిడ్‌రేంజ్ మోడల్స్ కూడా సరిపోవచ్చు.
బడ్జెట్‌కు తగ్గట్టు ఎంచుకోండి :
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ప్యూరిఫైయర్లు అవసరమైతే మొత్తం బడ్జెట్‌ను ముందే ప్లాన్ చేసుకోవాలి. బ్రాండ్ లేదా ఫ్యాన్సీ ఫీచర్ల కంటే పవర్, కవరేజ్, ఫిల్ట్రేషన్, మెయింటెనెన్స్ ఖర్చులను బట్టి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.