ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య నాగళ్ల సినిమాల్లోకి రాకముందు ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్‌ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. నటనపై ఉన్న పిచ్చితో ఉద్యోగాన్ని వదిలేసి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించింది.
వెండితెరపై మల్లేశం గుర్తింపు..
మల్లేశం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనన్య.. వకీల్ సాబ్, పొట్టేల్, డార్లింగ్, తంత్ర, శాకుంతలం వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ అటు హీరోయిన్‌గా, ఇటు సహాయక నటిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇంటర్వ్యూలో బ్రేకప్ గుట్టు రట్టు..
రీసెంట్ గా ఒక టాక్ షోలో పాల్గొన్న అనన్య తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ, ఒక వ్యక్తి వల్ల తాను ఎంతలా మోసపోయిందో, ఆ బ్రేకప్ బాధ తనను ఎంతలా కుదిపేసిందో చెబుతూ ఎమోషనల్ అయ్యింది.
కన్నీళ్లతో గడిచిన మూడేళ్లు..
"నేను దీన్ని లవ్ ఫెయిల్యూర్ అనను.. కానీ ఒక వ్యక్తిని ప్రాణంకంటే ఎక్కువగా నమ్మి మోసపోయాను. ఆ బ్రేకప్ తాలూకూ నరకాన్ని, మానసిక వేదనను దాదాపు మూడేళ్ల పాటు అనుభవించాను" అని అనన్య కన్నీరు పెట్టుకుంది.
సోషల్ మీడియా మీమ్స్‌పై ఫైర్..
అమ్మాయిలు ఎంతో సెన్సిటివ్ అని, కానీ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్లు ఎక్కువగా అబ్బాయిలు ఉండటం వల్లే కేవలం అమ్మాయిలనే తప్పుబడుతూ మీమ్స్ వేస్తారని, అమ్మాయిల వైపు ఉండే పెయిన్ ఎవరికీ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
సరికొత్త చిత్రం లీసా..
అనన్య నాగళ్ల లీడ్ రోల్‌లో నటిస్తున్న సరికొత్త వినూత్న చిత్రం లీసా. జవహర్ లాల్ రాజు దర్శకత్వంలో వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐలా ఈ భారీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సరికొత్త చిత్రం లీసా..
అనన్య నాగళ్ల లీడ్ రోల్‌లో నటిస్తున్న సరికొత్త వినూత్న చిత్రం లీసా. జవహర్ లాల్ రాజు దర్శకత్వంలో వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐలా ఈ భారీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మైండ్ బ్లాక్ చేసే పోస్టర్, ట్విస్టులు..
హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన వేడుకలో లీసా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రతి పది నిమిషాలకు ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుందని చిత్ర బృందం నమ్మకంగా చెప్తోంది.
తెల్లవార్లూ షూటింగ్.. అనన్య డెడికేషన్..
వ్యక్తిగతంగా ఎంత బాధ ఉన్నా అనన్య షూటింగ్స్ ఎగ్గొట్టలేదని, తెల్లవారుజామున 3 గంటల వరకు షూటింగ్ జరిగినా పూర్తి ఎనర్జీతో పనిచేసిందని నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి ఆమె డెడికేషన్‌ను ప్రశంసించారు.
సినిమా హిట్ అయితే ఫ్రీగా నెక్స్ట్ మూవీ..
లీసా కథ, విజువల్స్ తన కెరీర్‌లోనే బెస్ట్ అని నమ్మిన అనన్య.. ఈ సినిమా గనుక బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తే, ఇదే నిర్మాతలకు తన తదుపరి సినిమాను రూపాయి తీసుకోకుండా ఉచితంగా చేస్తానని క్రేజీ ఆఫర్ ఇచ్చింది.