క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక అనారోగ్యాలు మరో పదేళ్లలో గత చరిత్రగా మారవచ్చని Anthropic సీఈఓ డారియో అమోడెయ్ అంచనా వేశారు.
సరైన దిశలో పరిశోధనలు
మానవాళి సరైన దిశలో పరిశోధనలు కొనసాగిస్తే, వేల ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న అనేక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని అమోడెయ్ పేర్కొన్నారు.
వేగం పెంచే ఏఐ
జీవశాస్త్ర పరిశోధనలు, ఔషధాల తయారీ, వైద్య ఆవిష్కరణల ప్రక్రియను కృత్రిమ మేధ గణనీయంగా వేగవంతం చేయగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
హసాబిస్, మస్క్ ఆశాభావం
గూగుల్ ఏఐ విభాగం అధిపతి డెమిస్ హసాబిస్, ఎలాన్ మస్క్ కూడా గతంలో ఇలాంటి ఆశాభావమే వ్యక్తం చేశారు. పదేళ్లు పట్టే ఔషధ అభివృద్ధిని కొన్ని వారాల్లోనే పూర్తి చేయవచ్చని హసాబిస్ అన్నారు.
ఆల్ఫాఫోల్డ్ విజయం
ఇందుకు ఏఐ నిపుణులు ఆల్ఫాఫోల్డ్ను ఉదాహరణగా చూపుతున్నారు. ఈ టెక్నాలజీ 20 కోట్లకు పైగా ప్రొటీన్ల నిర్మాణాలను అంచనా వేయగలిగింది.
నిపుణుల భిన్నాభిప్రాయం
ఇలాంటి పురోగతి ఉన్నంత మాత్రాన క్యాన్సర్ వంటి సంక్లిష్ట వ్యాధులకు పదేళ్లలోనే పూర్తిస్థాయి చికిత్సలు వస్తాయని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వెర్టెక్స్ చైర్మన్ అభ్యంతరం
వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ లీడెన్ 50 ఏఐ సంస్థల టెక్నాలజీలను పరీక్షించారు. వాటిలో ఏదీ మానవ జోక్యం లేకుండా ఔషధాన్ని తయారు చేయలేకపోయిందని చెప్పారు.
ఇది తొలి దశ మాత్రమే
కంప్యూటర్ నమూనాలో ఔషధ అణువు ఆశాజనకంగా కనిపించడం తొలి దశ మాత్రమే. ఆ తర్వాత ల్యాబ్ పరీక్షలు, జంతువులపై అధ్యయనాలు, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేయాలి.
అనుమతులు తప్పనిసరి
ఔషధం సురక్షితమా, వ్యాధిని నిజంగా నయం చేస్తుందా అనేది ఈ దశల్లో నిర్ధారించాలి. చివరగా నియంత్రణ సంస్థల అనుమతులు పొందాలి.
10-12 ఏళ్ల ప్రక్రియ
సాధారణంగా కొత్త ఔషధం అందుబాటులోకి రావడానికి 10 నుంచి 12 ఏళ్లు పడుతుంది. ఏఐ వేగం పెంచినా, అన్ని దశలను తొలగించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు.