ప్లాస్టిక్ స్ట్రాలను తగ్గించేందుకు తీసుకొచ్చిన పేపర్ స్ట్రాలు పర్యావరణపరంగా ప్రతి విషయంలోనూ శ్రేష్ఠమైనవి కావని దక్షిణ కొరియా ప్రభుత్వ అధ్యయనం స్పష్టం చేసింది.
నాలుగు రకాల పోలిక:
సాధారణ ప్లాస్టిక్, పేపర్, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్, బయో-PE (చెరకుతో చేసే ప్లాస్టిక్) అనే 4 రకాల స్ట్రాల లైఫ్ సైకిల్‌పై ఈ పరిశోధన జరిగింది.
16 ప్రమాణాల పరిశీలన:
ముడి సరుకు తయారీ నుండి వినియోగం, ఆ తర్వాత వ్యర్థాల పారవేత వరకు మొత్తం 16 విభిన్న పర్యావరణ ప్రమాణాలపై ఈ స్ట్రాలను పరిశీలించారు.
ప్లాస్టిక్కే ఉత్తమమని తేలిన అంశాలు:
వాతావరణ మార్పులు, మానవ ఆరోగ్యంపై విషపదార్థాల ప్రభావం, గాలి కాలుష్యం వంటి 10 విభాగాల్లో సాధారణ ప్లాస్టిక్ స్ట్రాలే తక్కువ హానికరమని తేలింది.
క్యాన్సర్ కారక కాలుష్యం హెచ్చు:
సాధారణ ప్లాస్టిక్ స్ట్రాలతో పోలిస్తే పేపర్ స్ట్రాల లైఫ్ సైకిల్ ద్వారా పర్యావరణంలో కలిసే క్యాన్సర్ కారక కాలుష్య ప్రభావం 6.33 రెట్లు ఎక్కువ అని వెల్లడైంది.
యాసిడిఫికేషన్ ప్రభావం ఎక్కువ:
వాతావరణం, భూమిలో ఆమ్ల గుణాలను పెంచే సామర్థ్యం పేపర్ స్ట్రాలకు ప్లాస్టిక్ కంటే 2.04 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు.
రీసైక్లింగ్ కష్టతరం:
పేపర్ స్ట్రాల సైజు చాలా చిన్నగా ఉండటం, నీటిలో తడవకుండా ఉండటానికి వేసే కోటింగ్‌లు, గమ్ల వల్ల వీటిని రీసైక్లింగ్ ప్లాంట్లలో వేరు చేయడం చాలా కష్టమవుతోంది.
వ్యర్థాల కాలుష్యం:
సౌత్ కొరియా డేటా ప్రకారం వాడేసిన స్ట్రాలలో 73.6% తగలేస్తున్నారు, మిగిలిన 26.4% ల్యాండ్‌ఫిల్స్ (కచరా డిపోలు)కు చేరుతున్నాయి.
వినియోగదారుల నిరాసక్తత:
ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఏకంగా 87.5% మంది ప్రజలు పేపర్ స్ట్రాలను వాడటానికి ఇష్టపడటం లేదని తేల్చి చెప్పారు.
గ్రీన్ వాషింగ్‌పై విమర్శలు:
సరైన ప్రత్యామ్నాయాలు లేకుండా హడావుడిగా నిబంధనలు తేవడం కేవలం 'గ్రీన్ వాషింగ్' అని అక్కడి ఎంపీ కిమ్ వీ-సాంగ్ విమర్శించారు.