రంగును గమనించండి:

చాలామంది జీడిపప్పు ఎంత తెల్లగా ఉంటే అంత మంచిదనుకుంటారు, కానీ అది పొరపాటు. అసలైన జీడిపప్పు సహజ సిద్ధమైన క్రీమ్ లేదా లేత పసుపు రంగులో ఉంటుంది.
అతి తెల్లదనం ఉంటే ప్రమాదం:
పప్పులు మరీ తెల్లగా, మెరుస్తూ కనిపిస్తే వాటిని ఆకర్షణీయంగా మార్చడానికి హానికర బ్లీచింగ్ ఏజెంట్లు లేదా కెమికల్స్ వాడారని అర్థం.
సహజమైన ఆకారం:
స్వచ్ఛమైన జీడిపప్పు సహజమైన వంకీ తిరిగి ఉంటుంది. ప్యాకెట్‌లోని పప్పులన్నీ ఒకే పరిమాణంలో, కృత్రిమమైన ఆకారంతో ఉంటే అవి పిండితో చేసినవి కావచ్చు.
నీటి పరీక్ష:
ఒక గ్లాసు నీటిలో 3-4 జీడిపప్పులను వేయండి. అసలైన జీడిపప్పు గట్టిగా, బరువుగా ఉండటం వల్ల వెంటనే నీటి అడుగుభాగానికి మునుగుతుంది.
తేలియాడితే కల్తీ పప్పు :
ఒకవేళ నీటిలో వేసిన జీడిపప్పు పైకి తేలియాడితే, అది లోపల బోలుగా ఉందని లేదా రసాయనాలు కలిపిన నకిలీ పప్పు అని గుర్తించాలి.
సహజమైన రుచి :
అసలైన జీడిపప్పును నమిలినప్పుడు తేలికపాటి తీపి, క్రీమీ రుచి లభిస్తుంది. అలాగే తినేటప్పుడు సున్నితమైన క్రంచ్ ఇస్తుంది.
చేదు లేదా రుచిలేమి:
పప్పు నములుతుంటే మరీ గట్టిగా ఉన్నా, చేదుగా అనిపించినా లేదా అసలు రుచే లేకపోయినా అది పాతబడిపోయిన నిల్వ పప్పు లేదా కల్తీదని గ్రహించండి.
తాజా సువాసన:
తాజా జీడిపప్పును వాసన చూస్తే తేలికపాటి, ఆహ్లాదకరమైన నటీ సువాసన వస్తుంది.
కెమికల్ వాసన ఉంటే తీసుకోకండి :
జీడిపప్పు నుంచి బూజు వాసన, నిల్వ ఉన్న నూనె వాసన లేదా రసాయనాల స్మెల్ వస్తుంటే వాటిని అస్సలు కొనకూడదు.
ఆరోగ్య పరిరక్షణే ముఖ్యం :
కొద్దిపాటి ధర తక్కువ అని నాసిరకం జీడిపప్పును కొనకండి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించి నాణ్యమైన అసలైన జీడిపప్పును ఎంచుకోండి.