దేశంలో దాదాపు నలభై శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. నిద్ర లేమి అనేది అనేక ఇతర సమస్యలకు కారణమవుతుంది. ఈ సమస్యకు వీలైనంత త్వరగా చెక్ పెట్టాలి.
నిద్ర పట్టకపోవడానికి రాత్రిపూట తినే ఫుడ్ కూడా కారణం అవ్వొచ్చు. రాత్రిళ్లు తొందరగా తినేయడం, డిన్నర్లో జంక్ ఫుడ్ తగ్గించడం.. ఆకుకూరలు, ఫైబర్ ఉండే పదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి.
బెడ్రూమ్ క్లీన్‌గా, డిమ్ లైటింగ్‌తో ఉంటే నిద్ర బాగా పట్టే అవకాశం ఉంటుంది. అలాగే నిద్ర పట్టడం కోసం మంచి సువానస వచ్చేలా డిఫ్యూజర్స్, తేలికపాటి మ్యూజిక్ వంటి ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు.
పడుకున్న తర్వాత మొబైల్ వాడడం అలవాటు చేసుకుంటే నిద్రపోయే సమయం తగ్గుతుంటుంది. కాబట్టి పడుకునే ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వంటివి వాడకుండా కంట్రోల్ చేసుకోవాలి.
సాయంత్రం వేళల్లో కొంతసేపు వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే ఒళ్లు అలసిపోయి రాత్రిపూట చక్కగా నిద్రపడుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
ప్రతిరోజూ ఒక టైం టేబుల్ ప్రకారం నిద్ర పోవాలి. నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే దాని ప్రకారం శరీరం ట్యూన్ అవుతుంది. ఆటోమెటిక్‌గా టైంకి నిద్ర వస్తుంది.
నిద్రకు ముందు స్నానం చేయాలి. అలాగే పడుకునేముందు కాఫీ, టీ, స్మోకింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటి ద్వారా నిద్రలేమి సమస్య తగ్గుతుంది.