సుకన్య సమృద్ధి యోజన

ఆడపిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన ఈ పథకంలో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. పదేళ్లలోపు బాలికల పేరిట ఖాతా తెరవవచ్చు. ఏడాదికి రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు, రిటైర్మెంట్ కోసం పొదుపు చేయాలనుకునే మహిళలకు పీపీఎఫ్ ఉపయోగపడుతుంది. 15 ఏళ్ల కాలపరిమితి ఉన్న ఈ పథకంపై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఏడాదికి రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)
ఒకేసారి కొంత మొత్తాన్ని జమ చేసి నెలనెలా ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం అనుకూలం. ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ అందిస్తుండగా, వ్యక్తిగత ఖాతాలో రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
రికరింగ్ డిపాజిట్ (RD)
ప్రతి నెలా కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా ఆదా చేయాలనుకునే మహిళలు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఐదేళ్ల కాలపరిమితి గల ఆర్‌డీలో నెలకు రూ.100 నుంచే పొదుపు ప్రారంభించవచ్చు.
టైమ్ డిపాజిట్ (TD)
బ్యాంకు ఎఫ్‌డీ తరహాలో పనిచేసే ఈ పథకంలో ఒకేసారి డబ్బు జమ చేసి నిర్ణీత కాలానికి వడ్డీ పొందవచ్చు. ఐదేళ్ల డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ అందుబాటులో ఉంది. కనీస పెట్టుబడి రూ.1,000.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)
ఐదేళ్ల పాటు డబ్బును పొదుపు చేసి మెచ్యూరిటీ సమయంలో మంచి మొత్తాన్ని పొందాలనుకునే వారికి ఎన్‌ఎస్‌సీ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం 7.7 శాతం వడ్డీ లభిస్తుండగా, రూ.1,000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్
60 ఏళ్లు దాటిన మహిళలకు స్థిరమైన ఆదాయం అందించే ఈ పథకంలో 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.