కొత్త నిబంధనలు:

కేంద్ర ప్రభుత్వం టెలికాం వినియోగదారుల రక్షణ కోసం కొత్త చట్ట సవరణలను అమలులోకి తెచ్చింది.
30 రోజుల వాలిడిటీ:
ఇకపై ప్రీపెయిడ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా 30 రోజుల వాలిడిటీ కలిగిన రీచార్జ్ ప్లాన్‌లు అందుబాటులోకి వస్తాయి.
సంవత్సరానికి 12 రీచార్జ్‌లు:
30 రోజుల వాలిడిటీ ప్లాన్‌ల వల్ల యూజర్లు ఇకపై ఏడాదికి 13 సార్లు కాకుండా కేవలం 12 సార్లు మాత్రమే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
డేటా లేని ప్లాన్లు:
ఇంటర్నెట్ అవసరం లేని వినియోగదారుల కోసం కేవలం వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్ మాత్రమే ఉండే ప్లాన్‌లను అందించనున్నారు.
సామాన్యులకు ఊరట:
కేవలం కాలింగ్ కోసం ఫోన్ వాడే తక్కువ ఆదాయం ఉన్నవారికి, సాధారణ యూజర్లకు ఈ నిర్ణయం చాలా ఉపశమనం ఇస్తుంది.
ట్రాయ్ ఆదేశాలు:
ప్రతి వినియోగదారుడికి డేటా బండిల్ ప్లాన్‌ల అవసరం ఉండదని భావించిన ట్రాయ్, కొత్త టారిఫ్ నిబంధనలను రూపొందించింది.
ఎంపిక చేసుకునే స్వేచ్ఛ:
వినియోగదారులు తమ బడ్జెట్ అలాగే అవసరాలకు తగినట్లుగా తక్కువ కాల వ్యవధి ఉన్న ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.
రాఘవ్ చద్దా కృషి:
ఈ సమస్యపై గతంలో పార్లమెంట్‌లో గళం వినిపించిన ఎంపీ రాఘవ్ చద్దా, సామాన్యులకు తక్కువ ధరలో ప్లాన్‌లు కావాలని డిమాండ్ చేశారు.
పరిమిత ప్రత్యామ్నాయాలకు చెక్:
గతంలో మార్కెట్లో తక్కువ వాలిడిటీ ఉన్న కాలింగ్ ప్లాన్‌లు సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో యూజర్లు ఇబ్బంది పడ్డారు.
మెరుగైన సేవలు:
రాబోయే రోజుల్లో టెలికాం కంపెనీలు అన్నీ ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా విభిన్న రీచార్జ్ ఆప్షన్‌లను ప్రవేశపెట్టనున్నాయి.