Black Gram: ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆహార ధాన్యాల్లో మినుములు ఒకటి. పూర్వం నుంచి మన పెద్దలు ఉదయం టిఫిన్‌గా మినుములతో చేసిన పదార్థాలకే తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రోటీన్లు, పీచు పదార్థం, ఐరన్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉండే మినుములను రోజూ మన ఆహారంలో భాగం చేసుకుంటే కొండంత బలం లభిస్తుంది. శరీరానికి రోజంతా అవసరమయ్యే శక్తిని అందించడంలో మినుములు ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం.