నో మోర్ బోర్ బోర్డింగ్ వాయిస్:

ఐఫోన్‌లో సిరి చెప్పే రోజువారీ సమాధానాలు ఒకే వాయిస్‌లో విని విసుగు చెందితే సులువుగా కొత్త వాయిస్‌కి మారవచ్చు.
సెట్టింగ్స్‌లోకి వెళ్లండి:
ముందుగా మీ ఐఫోన్‌లో సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.
సిరి ఆప్షన్ ఎంచుకోండి :
కిందికి స్క్రోల్ చేసి 'Siri' లేదా iOS వెర్షన్‌ను బట్టి 'Apple Intelligence & Siri' ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
వాయిస్ సెక్షన్‌కి వెళ్లండి :
అక్కడ కనిపిస్తున్న విభిన్న ఆప్షన్లలో 'Siri Voice' లేదా 'Voice' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
రకరకాల యాక్సెంట్లు :
ఇక్కడ మీకు వివిధ రకాల వాయిస్ ఆప్షన్లు, విభిన్న దేశాల యాక్సెంట్లు అందుబాటులో కనిపిస్తాయి.
సింపుల్ డౌన్‌లోడ్ :
మీకు నచ్చిన వాయిస్‌ను సెలెక్ట్ చేసుకోగానే, ఐఫోన్ ఇంటర్నెట్ సహాయంతో ఆ వాయిస్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటుంది.
భాషను కూడా మార్చవచ్చు :
వాయిస్‌తో పాటు సిరి మాట్లాడే భాషను మార్చడానికి Settings > Siri > Language లోకి వెళ్లి మీకు కావలసిన భాషను ఎంచుకోవచ్చు.
నో థర్డ్ పార్టీ యాప్స్ :
ఈ మార్పుల కోసం ఎటువంటి థర్డ్ పార్టీ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐఫోన్ బిల్ట్-ఇన్ ఫీచర్‌తోనే ఇది సాధ్యమవుతుంది.
మిగిలిన సౌండ్స్ మారవు :
సిరి వాయిస్ మార్చడం వల్ల రింగ్‌టోన్, నోటిఫికేషన్, మ్యూజిక్ సౌండ్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. కేవలం సిరి మాట్లాడే తీరు మాత్రమే మారుతుంది.
ఆప్షన్ కనిపించకపోతే ఏం చేయాలి?
ఒకవేళ మీ ఫోన్‌లో 'Siri Voice' ఆప్షన్ కనిపించకపోతే, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చెక్ చేసుకోండి. కొన్ని వాయిస్ ఆప్షన్లు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.