పోషకాల గని:

సొరకాయలో విటమిన్ సి, బి, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
హైపర్‌టెన్షన్‌కు చెక్:
ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి, హైబీపీ సమస్యను తగ్గిస్తుంది.
గుండెకు రక్షణ:
ఈ జ్యూస్‌లోని సూక్ష్మ పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
న్యాచురల్ డిటాక్స్:
ఇది శరీరంలోని విష వ్యర్థాలను బయటకు పంపి, అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గడం సులభం:
ఇందులో పీచు పదార్థం ఎక్కువ, క్యాలరీలు తక్కువ. ఇది మెటబాలిజం పెంచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
జీర్ణక్రియ మెరుగు:
మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి సొరకాయ జ్యూస్ ఒక వరప్రసాదం.
యూరినరీ ఇన్ఫెక్షన్స్:
మూత్రపిండాల సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్‌లను తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
చర్మ సౌందర్యం:
రోజూ తాగడం వల్ల చర్మంపై ముడతలు తగ్గి, ముఖం కాంతివంతంగా మారుతుంది.
జుట్టు ఆరోగ్యం:
జుట్టు రాలడం తగ్గించడమే కాకుండా, చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారిస్తుంది.
ఎనర్జీ బూస్టర్:
వేసవిలో శరీరానికి చలువ చేయడంతో పాటు, రోజంతా ఉత్సాహంగా ఉండేలా శక్తిని ఇస్తుంది.