పోషకాల గని:

వాల్‌నట్స్‌లో శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.
బుర్రకు పదును:
వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి.
మతిమరుపునకు చెక్:
వాల్‌నట్స్‌ను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అల్జీమర్స్, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు సమస్యల ముప్పు తగ్గుతుంది.
గుండె భద్రం :
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
కొలెస్ట్రాల్ కంట్రోల్:
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండెపోటు (హార్ట్ ఎటాక్), స్ట్రోక్ ముప్పును నివారిస్తాయి.
ఈజీగా బరువు తగ్గొచ్చు:
వీటిలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇవి తింటే కడుపు నిండిన భావన కలిగి ఆకలి తగ్గుతుంది, తద్వారా బరువు అదుపులో ఉంటుంది.
బీపీ అదుపులో..:
వాల్‌నట్స్‌లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తనాళాలను సడలించి, రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
క్యాన్సర్ నిరోధకం:
ఇందులో ఉండే పాలీఫినాల్స్, విటమిన్ ఇ శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను నశింపజేస్తాయి. ఇవి క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల తీవ్రతను తగ్గిస్తాయి.
సూపర్ జీర్ణక్రియ:
అధిక ఫైబర్ ఉండటం వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
రోగనిరోధక శక్తి:
వాల్‌నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా బాడీ ప్రొటెక్ట్ అవుతుంది. పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది.