ఆరోగ్యకరమైన జీవనశైలిలో బ్రోకలీకి ప్రత్యేక స్థానం ఉంది. క్రూసిఫరస్ జాతికి చెందిన ఈ కూరగాయ అనేక రకాల తీవ్రమైన రోగాల నుంచి మనల్ని కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
క్యాన్సర్‌కు చెక్ పెట్టే సల్ఫోరాఫేన్
బ్రోకలీ మొలకలలో సల్ఫోరాఫేన్ అనే పవర్‌ఫుల్ పదార్థం ఉంటుంది. ఇది డీఎన్‌ఏలో వచ్చే అసాధారణ మార్పులను నియంత్రించి, క్యాన్సర్ కణాల పెరుగుదలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
రొమ్ము క్యాన్సర్ నివారణ
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, రోజూ ఒక కప్పు బ్రోకలీ మొలకలు తీసుకోవడం వల్ల మహిళల్లో అసాధారణ కణాల వృద్ధి ఆగిపోయి, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా..
పురుషులలో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడంలోనూ బ్రోకలీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని పోషకాలు క్యాన్సర్‌ను అణచివేసే జన్యువులకు రక్షణగా నిలుస్తాయి.
విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్ల గని
బ్రోకలీలో విటమిన్-సి తో పాటు రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ వంటి పిగ్మెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.
గుండె జబ్బుల నుంచి రక్షణ
బ్రోకలీని క్రమం తప్పకుండా డైట్‌లో చేర్చుకోవడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు దరిచేరవు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
ఆర్థరైటిస్ (కీళ్లనొప్పులు) నివారణ
యూనివర్సిటీల అధ్యయనాల ప్రకారం, బ్రోకలీని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యల తీవ్రత తగ్గుతుంది.
సూపర్ జీర్ణక్రియ
బ్రోకలీలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను అంతం చేసి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పొట్ట సమస్యలకు గుడ్ బై
గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి పొట్ట సమస్యలతో బాధపడేవారికి బ్రోకలీ అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది.
ఈరోజే డైట్‌లో చేర్చుకోండి
మొత్తంగా చూస్తే, అనేక రకాల అనారోగ్యాల నుంచి రక్షణ పొంది, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి బ్రోకలీని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది.