షుగర్ పేషంట్లు చెరుకు రసం తాగవచ్చా?

డయాబెటిస్ అనేది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. దీనితో బాధపడుతున్న రోగులు వారి ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఒకసారి దీని బారిన పడ్డాక, దానిని అదుపులో ఉంచడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
డయాబెటిస్ రోగులు స్వీట్లు తినకూడు. కానీ డయాబెటిస్ ఉన్న రోగి చెరకు రసం తాగవచ్చా?
చెరకు తీపిగా ఉంటుంది. దాని రసం రుచిలో కూడా చాలా తీపిగా ఉంటుంది. ఇందులో సహజ చక్కెర లభిస్తుంది.
దీనితో పాటు, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఇందులో కనిపిస్తాయి.
వేసవి కాలంలో ప్రజలు దీనిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
కానీ ఇందులో సహజ చక్కెర కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి కారణమవుతుంది.
డయాబెటిస్ ఉన్న రోగులు చెరుకు రసం తీసుకోకూడదు. ఎక్కువ మొత్తంలో కాకుండా రుచికోసం కొద్దిగా తాగవచ్చు.
అయితే మీరు చెరు రసం తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.