Health Tips: పెయిన్ కిల్లర్స్, యాంటీబియాటిక్స్ అతిగా వాడేస్తున్నారా.!
తీవ్రమైన కిడ్నీ ముప్పు
డాక్టర్ సూచన లేకుండా ఇష్టానుసారం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని సీడీఎస్‌సీవో హెచ్చరించింది.
ఎన్.ఎస్.ఏ.ఐ.డి మందులతో జాగ్రత్త
శరీరంలో నొప్పి తగ్గించడానికి వాడే నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అతిగా వాడితే కిడ్నీలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది.
యాంటీబియాటిక్స్ స్వీయ వైద్యం తగదు
వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా చిన్న సమస్యలకు ఎవరికివారే సొంత వైద్యం చేసుకుంటూ యాంటీబియాటిక్స్ వాడకూడదని స్పష్టం చేసింది.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తూచా తప్పకుండా పాటించాలి
వైద్యులు సూచించిన నిర్దిష్ట రోజులు మాత్రమే మందులు వాడాలి కానీ, నొప్పులు తగ్గగానే ఆపడం లేదా స్వయంగా పొడిగించడం చేయకూడదు.
మందులు ఇతరులతో పంచుకోవడం ప్రమాదకరం
ఒకరికి రాసిన యాంటీబియాటిక్స్ మందులను ఇంట్లో వాళ్లకు లేదా ఫ్రెండ్స్‌కి ఇవ్వడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
ఫార్మసిస్టులకు కఠిన ఆదేశాలు
షెడ్యూల్ హెచ్ మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా రిటైల్ దుకాణాల్లో అమ్మకూడదని ఫార్మసిస్టులను హెచ్చరించింది.
యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ముప్పు
యాంటీబియాటిక్స్ అనవసరంగా వాడటం వల్ల భవిష్యత్తులో బ్యాక్టీరియాపై ఆ మందులు పనిచేయకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది.
దీర్ఘకాలిక నొప్పులకు వైద్య సలహా తప్పనిసరి
జ్వరం లేదా ఒళ్లు నొప్పులు తగ్గకుండా మళ్లీ మళ్లీ వస్తుంటే, సొంతంగా మందులు వాడే బదులు కచ్చితంగా డాక్టర్‌ను కలవాలి.
ఆసుపత్రులలో మెరుగైన పర్యవేక్షణ
ఆసుపత్రులు, వైద్య సంస్థలు మందుల వాడకంపై రోగులకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలని, ప్రిస్క్రిప్షన్లను సరిగ్గా పరిశీలించాలని సూచించారు.