కొత్త లాక్డ్ చాట్స్ ఫీచర్ పరిచయం

చాట్‌జిపిటి ప్లాట్‌ఫారమ్‌లో అత్యంత సున్నితమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి ఈ నూతన భద్రతా విధానం ఎంతగానో సహాయపడుతుంది.
పిన్ లేదా బయోమెట్రిక్ భద్రత
వినియోగదారులు తమకు నచ్చిన నాలుగు అంకెల పిన్ కోడ్ లేదా ఫేస్ ఐడీ, టచ్ ఐడీ ద్వారా చాట్‌లను సులభంగా లాక్ చేయవచ్చు.
సాధారణ జాబితా నుంచి మాయం
ఒకసారి చాట్‌ను లాక్ చేసిన తర్వాత అది ప్రధాన చాట్ జాబితా, పిన్ చేసిన సంభాషణలు లేదా సెర్చ్ ఫలితాలలో కనిపించదు.
ప్రత్యేకమైన లాక్డ్ చాట్స్ సెక్షన్
లాక్ చేసిన ఆ ప్రత్యేక సంభాషణలు కేవలం పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే కొత్త సెక్షన్‌లో కనిపిస్తాయి.
తాత్కాలిక చాట్లకు భిన్నమైన విధానం
కొద్దిసేపటి తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యే తాత్కాలిక చాట్లలా కాకుండా, ఇవి అవసరమైనంత కాలం సురక్షితంగా దాగి ఉంటాయి.
ప్రత్యేకమైన మెమరీ స్పేస్ నిర్వహణ
లాక్ చేసిన చాట్లకు సంబంధించిన మెమరీ డేటా సాధారణ చాట్ అనుభవంతో కలవకుండా పూర్తిగా వేరుగా భద్రపరచబడుతుంది.
పిన్ కోడ్ మర్చిపోతే జరిగే నష్టం
ఒకవేళ లాగిన్ పిన్ కోడ్ మర్చిపోతే రీసెట్ చేసే సమయంలో అన్ని లాక్డ్ చాట్లు, ప్రైవేట్ మెమరీలు పూర్తిగా తొలగిపోతాయి.
అన్ని ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో లభ్యత
ఈ అప్‌డేట్ వెబ్‌సైట్, డెస్క్‌టాప్ యాప్‌లు, ఐఓఎస్ అలాగే ఆండ్రాయిడ్ డివైజ్‌లలో దశలవారీగా అందుబాటులోకి వస్తోంది.
కొన్ని పరిమితులు ఉన్న ఫీచర్
తాత్కాలిక చాట్లు, గ్రూప్ చాట్లు, షేర్ చేసిన లింకులు లేదా ఆర్కైవ్ చేసిన సంభాషణలను లాక్ చేయడానికి ఈ ఆప్షన్ పనిచేయదు.
డేటా భద్రతకు పెద్దపీఠ
వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడానికి అలాగే ఇతరులు ఫోన్ చూసేటప్పుడు రహస్యాలు బయటపడకుండా ఉండటానికి ఇది అద్భుతమైన సదుపాయం.