క్లౌడ్ ఏఐ కొత్త రూల్

Anthropic తన ఏఐ మోడల్ Claudeలో కీలక మార్పులు చేసింది. ఇకపై పాత వీడియో గేమ్స్‌ను యథాతథంగా మళ్లీ రూపొందించడం సాధ్యం కాకపోవచ్చు.
అనుమతి లేకుండా కుదరదు
ఇతర సంస్థలు రూపొందించిన గేమ్స్‌ను అనుమతి లేకుండా తిరిగి సృష్టించకుండా Claudeలో కొత్త పరిమితులు విధించారు.
కొత్త గేమ్స్‌కు ఓకే
కొత్త గేమ్ సృష్టికి అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ఉన్న గేమ్‌ను కాపీ చేయడానికి మాత్రం అనుమతి లేదని కంపెనీ స్పష్టం చేసింది.
కాపీరైట్‌కు అడ్డుకట్ట
మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనను అరికట్టడమే ఈ అప్‌డేట్ ఉద్దేశమని Anthropic టెక్నికల్ సిబ్బంది Addy Osmani వెల్లడించారు.
వినియోగ విధానాలకు విరుద్ధం
సంస్థ వినియోగ విధానాలకు విరుద్ధంగా ఇతరుల సృజనాత్మక పనులను అనుమతి లేకుండా వాడటాన్ని ఈ మార్పు నిరోధిస్తుంది.
సొంత ఐడియాలకు స్వేచ్ఛ
వినియోగదారులు స్వయంగా రూపొందించిన డిజైన్లు, గేమ్ ఐడియాలు, ఇతర ఆస్తుల ఆధారంగా కొత్త గేమ్స్ తయారు చేసుకోవచ్చు.
AAA గేమ్స్ బ్రౌజర్‌లో
ఏఐ టూల్స్ సాయంతో భారీ బడ్జెట్ AAA గేమ్స్‌ను డీకంపైల్ చేసి, బ్రౌజర్‌లో ఆడుకునేలా మార్చే ప్రయత్నాలు పెరుగుతున్నాయి.
డీకంపైల్ అంటే ఏంటి
ఒక గేమ్‌లోని కోడ్, నిర్మాణాన్ని విశ్లేషించి దాన్ని మరో రూపంలో అందుబాటులోకి తీసుకురావడాన్ని డీకంపైల్ చేయడం అంటారు.
5 లక్షల మంది రచయితల కేసు
కాపీరైట్ రచనలను మోడళ్ల శిక్షణకు వాడారంటూ సుమారు 5 లక్షల మంది రచయితలు వేసిన కేసులో Anthropic 1.5 బిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది.
ఎల్విస్ ప్రెస్లీ ఎస్టేట్ దావా
ఇటీవల ఎల్విస్ ప్రెస్లీ ఎస్టేట్ కూడా Anthropicపై దావా వేసింది. ఈ వివాదాలతో సంస్థ మరింత అప్రమత్తమై Claudeలో మార్పులు చేస్తోంది.