క్లాడ్‌లో పర్సనల్ ఫైనాన్స్

Anthropic తన ఏఐ చాట్‌బాట్ Claudeలో 'పర్సనల్ ఫైనాన్స్' అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అన్ని వివరాలు ఒకేచోట
ఆదాయం, ఖర్చులు, బ్యాంక్ బ్యాలెన్స్, క్రెడిట్ కార్డు లావాదేవీల వివరాలను ఈ ఫీచర్‌తో ఒకేచోట తెలుసుకోవచ్చు.
ప్లెయిడ్‌తో భాగస్వామ్యం
ఈ ఫీచర్ కోసం Anthropic, Plaid సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులను నేరుగా క్లాడ్‌కు లింక్ చేసుకోవచ్చు.
ఏ ప్రశ్నలు అడగొచ్చు
నెలవారీ ఖర్చు ఎంత, ఏ విభాగంలో ఎక్కువ ఖర్చవుతోంది, బ్యాలెన్స్ ఎంత, రాబోయే బిల్లులేంటి అని క్లాడ్‌ను అడగొచ్చు.
చదివి విశ్లేషించడమే
ఈ ఫీచర్ సమాచారాన్ని చదివి విశ్లేషించడానికి మాత్రమే పరిమితం. నగదు బదిలీలు, చెల్లింపులు, పెట్టుబడి లావాదేవీలు చేయదు.
ప్రకటనలు ఉండవు
ఆర్థిక రంగానికి సంబంధించిన తెలియని పదాలను సులభమైన భాషలో వివరిస్తుంది. ఈ ఫీచర్‌లో ప్రకటనలు, స్పాన్సర్డ్ సిఫార్సులు ఉండవని సంస్థ తెలిపింది.
2 ఏళ్ల చరిత్ర విశ్లేషణ
బ్యాంక్ పేరు, ఖాతా రకం, ఖాతా నంబర్‌లోని చివరి 4 అంకెలు, బ్యాలెన్స్‌లు, క్రెడిట్ పరిమితులు కనిపిస్తాయి. గరిష్ఠంగా 2 ఏళ్ల లావాదేవీల చరిత్రను విశ్లేషించగలదు.
శిక్షణకు వాడరు
పర్సనల్ ఫైనాన్స్ విభాగంలో జరిగే సంభాషణలను ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించబోమని Anthropic స్పష్టం చేసింది.
చార్టులు, డ్యాష్‌బోర్డ్‌లు
వారంవారీ ఖర్చుల చార్ట్, రాబోయే చెల్లింపుల క్యాలెండర్, డ్యాష్‌బోర్డ్‌ను ఆర్టిఫాక్ట్స్ రూపంలో తయారు చేయమని అడగొచ్చు. తర్వాత మార్పులు కూడా చేసుకోవచ్చు.
ఇది ప్రారంభం మాత్రమే
ఆర్థిక నిర్ణయాలకు క్లాడ్‌ను పూర్తిగా అధికారిక వనరుగా చూడొద్దని సంస్థ సూచించింది. ఓపెన్‌ఏఐ కూడా చాట్‌జీపీటీ ఫైనాన్సెస్‌ను అందిస్తోంది.