ముక్కలను శుభ్రంగా కడగడం

కాలీఫ్లవర్ ముక్కలను మీడియం సైజులో కట్ చేసి, వేడి నీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టి వడకట్టాలి.
మసాలా పట్టించే విధానం
శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలకు చిటికెడు పసుపు, కొద్దిగా కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
దోరగా వేయించుకోవడం
బాణలిలో నూనె వేడి చేసి మసాలా కలిపిన ముక్కలను మీడియం ఫ్లేమ్‌లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
పోపు దినుసులు వేయడం
అదే గిన్నెలో మరో స్పూన్ నూనె వేసి జీలకర్ర, ఆవాలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్
ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
మసాలాలు చేర్చడం
ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
ముక్కలను కలపడం
ముందుగా వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను ఈ మసాలా మిశ్రమంలో వేసి మెల్లగా కలపాలి.
చిన్న మంటపై వేయించడం
మసాలా అంతా ముక్కలకు పట్టేలా నిదానంగా కలుపుతూ మరో 3 నుంచి 5 నిమిషాల పాటు చిన్న మంటపై వేయించాలి.
కొత్తిమీరతో అలంకరణ
చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
అద్భుతమైన కాంబినేషన్
వేడి వేడి అన్నంలోకి, సాంబార్ లేదా చపాతీతో ఈ కాలిఫ్లవర్ వేపుడు అద్భుతమైన సైడ్ డిష్‌గా ఉంటుంది.