రిటెన్షన్ గడువుకు ముందు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నలుగురు ఆటగాళ్లతో కూడిన ట్రేడ్‌ను ధ్రువీకరించాయి.
చెన్నైకి వచ్చేది వీళ్లే
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ ఎస్ఆర్హెచ్ను వీడి సీఎస్కేలో చేరారు.
హైదరాబాద్‌కు వెళ్లేది వీళ్లే
ప్రతిగా భారత పేసర్ ఖలీల్ అహ్మద్, ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ నాథన్ ఎల్లిస్ ఎస్ఆర్హెచ్కు వెళ్లారు.
లివింగ్‌స్టోన్ రూ.7 కోట్ల కోత
ఎస్ఆర్హెచ్ రూ.13 కోట్లకు కొన్న లివింగ్‌స్టోన్, రూ.6 కోట్ల తగ్గిన ఫీజుతో సీఎస్కేలో చేరాడు.
ఎడ్వర్డ్స్ రూ.3 కోట్లకే
ఆసీస్ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ ప్రస్తుత ఫీజు రూ.3 కోట్లతోనే చెన్నైకి వెళ్లాడు. కాలి గాయంతో ఐపీఎల్ 2026లో ఆడలేకపోయాడు.
ఖలీల్ ఘర్ వాపసీ
2018 నుంచి 2021 వరకు ఎస్ఆర్హెచ్ తరఫున ఆడిన ఖలీల్ అహ్మద్, రూ.4.8 కోట్ల ప్రస్తుత ఫీజుతో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాడు.
ఖలీల్ ఐపీఎల్ 2025 ప్రదర్శన
ఐపీఎల్ 2025లో సీఎస్కే తరఫున 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. 2026లో ఐదు మ్యాచ్‌లు ఆడాక కుడి క్వాడ్రిసెప్స్ గాయంతో సీజన్ నుంచి తప్పుకున్నాడు.
ఎల్లిస్ రూ.2 కోట్లకు
నాథన్ ఎల్లిస్ ప్రస్తుత ఫీజు రూ.2 కోట్లతోనే ఎస్ఆర్హెచ్లో చేరాడు. వేరియేషన్స్, డెత్ ఓవర్ బౌలింగ్‌కు పేరున్న ఎల్లిస్ హైదరాబాద్ పేస్ విభాగాన్ని బలపరుస్తాడు.
హార్దిక్ రేసులో చెన్నై?
హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే సహా కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ ఆసక్తిగా ఉన్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలు ఇంకా కచ్చితమైన చర్చల వరకు వెళ్లలేదు.
ఇక అందరి దృష్టి రిటెన్షన్లపై
రిటెన్షన్ గడువు దగ్గరపడుతున్న వేళ హార్దిక్‌తో సహా మరిన్ని ట్రేడ్ డీల్స్ రాబోయే రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది.