పోషకాల ఖజానా సీతాఫలం

సీతాఫలంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అలాగే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యం మెరుగుదల
ఈ పండును క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె పనితీరు మెరుగై ఆరోగ్యంగా ఉంటుంది.
జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా
ఇందులో లభించే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు సమస్యలను దూరం చేస్తుంది.
రోగనిరోధక శక్తి పెంపుదల
శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
హిమోగ్లోబిన్ శాతం వృద్ధి
రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేసి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.
షుగర్, బీపీ కంట్రోల్‌
షుగర్ అలాగే బీపీ అదుపులో ఉండేలా చూసుకోవడానికి ఈ పండు ఎంతోగానో సహాయపడుతుంది.
చర్మం, జుట్టు నిగారింపు
చర్మం కాంతివంతంగా మారడానికి అలాగే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఇది చక్కగా పనిచేస్తుంది.
తక్షణ శక్తిని అందించే గుణం
శరీరానికి తక్షణ శక్తిని అందించి నీరసం అలాగే కండరాల బలహీనతను పూర్తిగా తగ్గిస్తుంది.
సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం
వాతావరణ మార్పుల కారణంగా వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడ్పాటు
సహజసిద్ధంగా లభించే ఈ పండును తీసుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడుకోవచ్చు.