Grapes: నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో లభించే ద్రాక్ష పండ్లు కేవలం రుచికరమైనవే కాకుండా, మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. రోజూ పరిమితంగా ద్రాక్షను తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.