పండుగల వేళ ఆఫర్లు చూసి క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేస్తున్నారా? అయితే చిన్న పొరపాటు కూడా మీ నెలవారీ బడ్జెట్‌ను దెబ్బతీయవచ్చు. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఈఎంఐ సదుపాయాల వెనుక ఉన్న నిబంధనలను అర్థం చేసుకుని ఖర్చు చేస్తేనే ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి.