ఉదయం వాకింగ్, వర్కౌట్స్ ఆపేయండి

కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయట పరిగెత్తడం లేదా వాకింగ్ చేయడం వల్ల శ్వాస వేగమై ఎక్కువ విషగాలి ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. కాబట్టి అవుట్‌డోర్ వ్యాయామాలకు బదులు ఇంట్లోనే సురక్షితంగా ఇన్ డోర్ వ్యాయామాలు చేసుకోండి.
పిల్లలను ఎక్కుసేపు బయట ఆడుకోనివ్వకండి
చిన్న పిల్లల ఊపిరితిత్తులు ఎదుగుతున్న దశలో ఉంటాయి కాబట్టి కాలుష్యం ప్రభావం వారిపై ఎక్కువగా ఉంటుంది. ఏక్యూఐ ఎక్కువగా ఉన్న రోజుల్లో పార్కులు, మైదానాల్లో ఎక్కుసేపు ఉండకుండా చూడండి.
వాహనాల రద్దీ ఎక్కువ ఉన్న రోడ్లపై తిరగొద్దు
ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కూడళ్లు, రోడ్ల వద్ద వాహనాల పొగ, ధూళి తీవ్రంగా ఉంటాయి. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే రద్దీ తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోండి.
నిర్మాణ స్థలాల దగ్గర వ్యాయామం చేయకండి
నిర్మాణ పనులు జరిగే చోట దుమ్ము, ధూళికణాలు గాలిలో విపరీతంగా కలుస్తాయి. అలాంటి ప్రాంతాల పరిసరాల్లో నడవడం లేదా సైక్లింగ్ చేయడం వంటివి అస్సలు చేయవద్దు.
ఓపెన్ స్థలాల్లో ఎక్కువసేపు సమావేశాలు వద్దు
వాతావరణం దారుణంగా ఉన్నప్పుడు బయట పిక్నిక్‌లు, క్రీడా పోటీలు లేదా సోషల్ గ్యాథరింగ్‌లను వాయిదా వేసుకోవడం మంచిది. ఎక్కుసేపు బయట ఉండటం వల్ల విషపూరిత గాలికి గురికావాల్సి వస్తుంది.
మాస్క్ లేకుండా బయటకు అడుగుపెట్టొద్దు
బయటకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంటే ముక్కు, నోటిని పూర్తిగా కప్పే సరిగ్గా అమరే N95 లేదా సమానమైన రక్షక మాస్క్‌ను వాడండి. సాధారణ గుడ్డ మాస్క్‌లు సన్నని ధూళికణాల నుంచి రక్షణ ఇవ్వలేవు.
పీక్ టైమ్‌లో శ్రమతో కూడిన పనులు చేయకండి
ఉదయం వేళలు సురక్షితం అనుకోవడం పొరపాటు. గాలి వేగం, ఉష్ణోగ్రత బట్టి కాలుష్యం ఎప్పుడైనా మారవచ్చు. కాబట్టి ప్రయాణానికి ముందు ఏక్యూఐ చెక్ చేసుకుని బయట కష్టమైన పనులు తగ్గించుకోండి.
శ్వాస సమస్యలు, దగ్గును నిర్లక్ష్యం చేయవద్దు
బయటకు వెళ్లొచ్చాక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎదలో అసౌకర్యం, ఎడతెగని దగ్గు లేదా కళ్ల మంటలు ఉంటే వెంటనే ఇంట్లోకి మారి విశ్రాంతి తీసుకోండి. శ్వాస అందకపోతే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.