అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు శుభవార్త

దేశీయంగా విజయవంతమైన డిజి యాత్ర సేవలను ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణాల కోసం కూడా విస్తరించేలా ట్రయల్స్ మొదలుపెట్టారు.
ఏడు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో పరిశీలన
ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, కొచ్చి అలాగే అమృత్‌సర్ విమానాశ్రయాలలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఎయిర్ ఇండియా & ఇండిగో భాగస్వామ్యం
ప్రస్తుత ప్రారంభ దశలో ఎయిర్ ఇండియా అలాగే ఇండిగో విమాన సర్వీసులలో ప్రయాణించే వారికి మాత్రమే ఈ సదుపాయం లభిస్తుంది.
ఈ-పాస్‌పోర్ట్ కలిగిన భారతీయ పౌరులకు అవకాశం
ఎలక్ట్రానిక్ చిప్ కలిగిన ఈ-పాస్‌పోర్ట్ ఉన్న భారతీయ పౌరులు మాత్రమే ఈ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అర్హులు.
డిజి యాత్ర యాప్ ద్వారా రిజిస్ట్రేషన్
మొబైల్ యాప్‌లో పాస్‌పోర్ట్ వివరాలు స్కాన్ చేసి, సెల్ఫీ అప్‌లోడ్ చేయడం ద్వారా డిజిటల్ క్రెడిటోషియల్స్ క్రియేట్ చేసుకోవాలి.
ఎన్‌ఎఫ్‌సీ (NFC) టెక్నాలజీ వినియోగం
స్మార్ట్‌ఫోన్ ద్వారా పాస్‌పోర్ట్‌లోని ఎలక్ట్రానిక్ చిప్‌ను రీడ్ చేయడానికి ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్ ఉపయోగపడుతుంది.
పాస్‌పోర్ట్ & వీసా తనిఖీలు తప్పనిసరి
ఇది కేవలం ప్రవేశం కోసం మాత్రమే కాబట్టి ప్రయాణికులు విధిగా తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్, వీసా వెంట ఉంచుకోవాలి.
ఇమ్మిగ్రేషన్ తనిఖీలకు ప్రత్యామ్నాయం కాదు
ఈ విధానం కేవలం ప్రయాణాన్ని సులభతరం చేస్తుందే తప్ప, ఎయిర్‌పోర్ట్ ఇమ్మిగ్రేషన్ తనిఖీలను ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తీ చేయదు.
వచ్చే ఏడాది నాటికి పూర్తి స్థాయి విస్తరణ
ఈ ట్రయల్స్ ద్వారా వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా 2027 నాటికి దేశవ్యాప్తంగా మరింత విస్తృత స్థాయిలో దీన్ని అమలు చేయనున్నారు.
ప్రయాణికుల సమయం ఆదా చేసే చర్య
ఎయిర్‌పోర్ట్ చెక్‌పోస్టుల వద్ద క్యూ లైన్లలో నిలబడే శ్రమ లేకుండా చాలా వేగంగా తనిఖీలు పూర్తి కావడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.