విజయశాంతి ఎంత రెమ్యూనరేషన్ తీసుకొంటున్నారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం

అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించున్నారు విజయశాంతి. కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 18న విడుదల కానుంది.
విజయశాంతి అసలు పేరు శాంతి. సినిమాల్లోకి వచ్చే ముందు విజయను చేర్చారు ఆమె తల్లి. దీంతో విజయశాంతిగా మారింది.
13ఏళ్ల వయస్సులో తమిళ మూవీ కల్లుక్కుళ్ ఈరంతో తెరంగేట్రం చేశారు విజయశాంతి.
తెలుగులో తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు. ఈ మూవీ 1980లో వచ్చింది.
విజయశాంతికి హీరో స్థాయిలో ఈమేజ్ తీసుకువచ్చిన మూవీ కర్తవ్యం.
అప్పుడే కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న తొలిహీరోయిన్ విజయశాంతి.
టి క్రిష్ణ డైరెక్షన్ వహించిన చిత్రాలన్నింటిలోనూ విజయశాంతినే హీరోయిన్
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సహా 185 చిత్రాల్లో నటించారు.
ప్రజాసేవకే జీవితం అంకితం చేయాలని విజయశాంతి దంపతులు పిల్లలను వద్దనుకున్నారు.