బ్యాక్‌గ్రౌండ్ యాప్‌ల క్లియరెన్స్

ఫోన్‌ను రీస్టార్ట్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో అనవసరంగా రన్ అవుతున్న యాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి.
ర్యామ్ ఖాళీ అవ్వడం
ఫోన్ మెమరీ లేదా రామ్‌పై పడుతున్న అదనపు భారం తగ్గిపోయి మొబైల్ పనితీరు మెరుగవుతుంది.
తాత్కాలిక డేటా తొలగింపు
యాప్‌లు వాడేటప్పుడు క్రియేట్ అయ్యే టెంపరరీ ఫైల్స్, క్యాష్ డేటా రీస్టార్ట్ చేయడం ద్వారా క్లీన్ అవుతాయి.
మందగించిన ప్రాసెసింగ్ వేగం
ఎక్కువ సేపు ఫోన్ ఆన్‌లో ఉండటం వల్ల ప్రాసెసర్ వేడెక్కి స్లో అవుతుంది, రీస్టార్ట్ చేయడం వల్ల సిస్టమ్ రిఫ్రెష్ అవుతుంది.
బ్యాటరీ లైఫ్ మెరుగవ్వడం
అనవసరమైన ప్రాసెస్‌లు ఆగిపోవడం వల్ల బ్యాటరీ వినియోగం తగ్గి ఫోన్ ఛార్జ్ ఎక్కువ సేపు వస్తుంది.
హ్యాంగ్ సమస్యలకు చెక్
ఫోన్ అప్పుడప్పుడు హ్యాంగ్ అవ్వడం లేదా స్క్రీన్ ఫ్రీజ్ అయిపోవడం వంటి చిన్నపాటి సమస్యలు దానంతట అవే తొలగిపోతాయి.
నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్యలు
ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు లేదా నెట్‌వర్క్ సిగ్నల్ రానప్పుడు రీస్టార్ట్ చేస్తే టవర్ సమస్యలు సెట్ అవుతాయి.
మొత్తం సిస్టమ్ రీబూట్
ఆపరేటింగ్ సిస్టమ్‌లోని చిన్నపాటి గ్లిచ్‌లు, ఎర్రర్‌లు రీబూట్ చేయడం ద్వారా సరి చేయబడతాయి.
ఎప్పటికప్పుడు రీస్టార్ట్ చేయడం మంచిదా
వారానికి ఒకసారైనా ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ద్వారా మొబైల్ లైఫ్ అండ్ స్పీడ్ చాలావరకు అదుపులో ఉంటాయి.
పెద్ద సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదు
ఫోన్ చాలా పాతదైనా లేదా ఇంటర్నల్ స్టోరేజ్ పూర్తిగా నిండిపోయినా కేవలం రీస్టార్ట్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.