Constipation : మలబద్ధకాన్ని అస్సలు లైట్ తీసుకోకండి.. దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే వచ్చే డేంజర్ ఇదే
సాధారణ సమస్యే కానీ:
మలబద్ధకం అనేది ఒక సాధారణ జీర్ణ సమస్యే అయినప్పటికీ, కొన్ని వారాల పాటు ఇది అలాగే కొనసాగితే మాత్రం శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది.
పైల్స్ ముప్పు:
దీర్ఘకాలిక మలబద్ధకం వల్ల మలవిసర్జన సమయంలో అధికంగా ఒత్తిడి పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల రక్తాన్ని తీసుకెళ్లే సిరలు ఉబ్బి పైల్స్ (హెమరాయిడ్స్) వచ్చే ప్రమాదం ఉంది.
అనల్ ఫిషర్స్ సమస్య:
గట్టి మలం కారణంగా మలద్వారం వద్ద చర్మం చీలిపోతుంది. దీనినే అనల్ ఫిషర్స్ అంటారు. ఇది విపరీతమైన నొప్పి, మంట, రక్తస్రావానికి దారితీస్తుంది.
రెక్టల్ ప్రోలాప్స్:
సమస్య మరీ తీవ్రమైతే.. నిరంతరం ముక్కడం వల్ల పెద్దపేగు చివరి భాగం (రెక్టమ్) మలద్వారం గుండా బయటకు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
రోజువారీ అసౌకర్యం:
నిరంతరం వేధించే మలబద్ధకం వల్ల కడుపు ఉబ్బరం, తీవ్రమైన గ్యాస్, అజీర్ణం, పొట్టలో ఎప్పుడూ ఒక రకమైన అసౌకర్యం ఉండి రోజువారీ జీవితాన్ని ఇబ్బంది పెడుతుంది.
ఈ రెడ్ అలర్ట్ లక్షణాలు జాగ్రత్త:
మలబద్ధకంతో పాటు మలంలో రక్తం పడటం, విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, జ్వరం లేదా కారణం లేకుండా బరువు తగ్గిపోతుంటే వెంటనే అలర్ట్ అవ్వాలి.
పీచు పదార్థాలు ముఖ్యం:
ఈ సమస్య రాకుండా ఉండాలంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు వంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్లో చేర్చుకోవాలి.
హైడ్రేషన్ చాలా అవసరం:
శరీరంలో నీటి శాతం తగ్గితే మలం గట్టిగా మారుతుంది. అందుకే రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగడం అలవాటు చేసుకోవాలి.
శారీరక శ్రమ తప్పనిసరి:
రోజంతా ఒకేచోట కూర్చోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా వ్యాయామం చేయడం వల్ల ప్రేగుల కదలికలు మెరుగవుతాయి.
వైద్యుల సలహా తీసుకోండి:
జంక్ ఫుడ్స్ మానేసి, జీవనశైలిలో మార్పులు చేసుకున్నప్పటికీ మలబద్ధకం తగ్గకపోతే సొంత వైద్యాలు మానేసి వెంటనే మంచి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ను సంప్రదించడం ఉత్తమం.