బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఉదయం ఈ 5 డ్రింక్స్ తాగాల్సిందే

నేటికాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు వ్యాయామాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు.
బరువు తగ్గాలనుకునేవారు ఉదయం వ్యాయామం చేయడంతోపాటు ఈ డ్రింక్స్ తాగితే కొవ్వు కరిగిపోతుంది.
తేనె, లెమన్ వాటర్ తాగితే కొలెస్ట్రాల్ బర్న్ అవుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అరటీస్పూన్ తేనె, 1 టీస్పూన్ నిమ్మరసం కలిపి ఉదయం, రాత్రి పడుకునే ముందు తాగాలి.
జీరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గ్లాసు వేడి నీళ్లు తీసుకుని అందుతూ జీరా కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
మజ్జిగ కూడా కొవ్వును కరిగిస్తుంది. ఇందులో విటమిన్ బి 12 ఉంటుంది. ఒక కప్పు పెరుగులో నీళ్లు, హాఫ్ టీస్పూన్ జీర పొడి, ఉప్పు వేసుకుని తాగాలి.
దాల్చిన చెక్క టీ తాగితే కూడా బరువు తగ్గుతారు. ఒక గ్లాసు వేడినీటిలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగాలి.
గ్రీన్ టీ ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. ఇది తాగితే బరువు తగ్గుతారు.
వీటితో పాటు ప్రతిరోజూ నడక, జాగింగ్, ఎక్స్ సైజ్, సమతుల్య ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారు.
వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం.