కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, కాలివేళ్ళు, మడమ నొప్పి, చేతులు, కాలివాపు వంటి విపరీతమైన నొప్పులతో బాధపడుతున్నారా. ఈ లక్షణాలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
మన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి.
మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో యూరిక్ యాసిడ్ ఒకటి. మనం తినే ఆహారంలో ప్యూరిన్ అనే రసాయనం విచ్చిన్నమైతే యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.
యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల గుండెల్లో మంట, కిడ్నీ స్టోన్, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్య, చేతులు, కాళ్లు ఎర్రగా వాపు వంటి సమస్యలు వస్తాయి.
ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి. అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ వాపు, కీళ్ల నొప్పులు, మలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
తాజా క్యారెట్ జ్యూసులో నిమ్మరసం కలిపి తాగితే యూరిక్ యాసిడ్స్ లెవల్స్ అదుపులో ఉంటాయి. క్యారెట్ జ్యూసులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, ఫైబర్, బీటా కెరోటిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పెరిగిన యూరిక్ యాసిడ్ లెవల్స్ ను తగ్గిస్తాయి.
దోసకాయ రసంలో నిమ్మరసం కలిపి తాగితే కాలేయం, కిడ్నీలు డిటాక్సిఫై అవుతాయి. రక్తంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ కూడా తగ్గుతాయి. దోసకాయలో పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. ఇవి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.
యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు పై జ్యూసులను తాగితే సమస్య నుంచి బయటపడవచ్చు.